YA GOVERNMENT COLLEGE FOR WOMEN

Chirala, Prakasam District, A.P

Affiliated to ANDHRA KESARI UNIVERSITY, ONGOLE

Accredited by NAAC with 'B++' Grade

08594-232204
gdcwchirala@gmail.com

Telugu

Course Outcomes


Course Outcomes (COs)

బి.ఏ., బి.కాం., బి.యస్సి., తదితర ప్రోగ్రాములు
అంశం: జనరల్ తెలుగు, సెమిస్టర్-1
కోర్సు-1 : ప్రాచీన తెలుగు కవిత్వం

అభ్యసన ఫలితాలు:
ఈ కోర్సు విజయవంతంగా ముగించాక, విద్యార్థులు క్రింది అభ్యసన ఫలితాలను పొందగలరు.
1. ప్రాచీన తెలుగుసాహిత్యం యొక్క ప్రాచీనతను, విశిష్టతను గుర్తిస్తారు. తెలుగుసాహిత్యంలో ఆదికవి నన్నయ కాలంనాటి భాషాసంస్కృతులను, ఇతిహాసకాలం నాటి రాజనీతి విషయాలపట్ల పరిజ్ఞానాన్ని సంపాదించగలరు.
2. శివకవుల కాలంనాటి మతపరిస్థితులను, భాషావిశేషాలను గ్రహిస్తారు. తెలుగు నుడికారం, సామెతలు, లోకోక్తులు మొదలైన భాషాంశాల పట్ల పరిజ్ఞానాన్ని పొందగలరు.
3. తిక్కన భారతంనాటి మత, ధార్మిక పరిస్థితులను, తిక్కన కవితాశిల్పాన్ని, నాటకీయతను అవగాహన చేసుకోగలరు.
4. ఎఱ్ఱన సూక్తివైచిత్రిని, ఇతిహాస కవిత్వంలోని విభిన్న రీతులపట్ల అభిరుచిని పొందగలరు. శ్రీనాథుని కాలం నాటి కవితావిశేషాలను, మొల్ల కవితా విశిష్టతను గుర్తించగలరు.
5. తెలుగు పద్యం స్వరూప స్వభావాలను, సాహిత్యాభిరుచిని పెంపొందించుకుంటారు. ప్రాచీన కావ్యభాషలోని వ్యాకరణాంశాలను అధ్యయనం చేయడం ద్వారా భాషాసామర్ధ్యాన్ని రచనల మెళకువలను గ్రహించగలరు.

బి.ఏ., బి.కాం., బి.యస్సి., తదితర ప్రోగ్రాములు
à°…à°‚à°¶à°‚: జనరల్ తెలుగు, à°¸à±†à°®à°¿à°¸à±à°Ÿà°°à±-2
కోర్సు-2 : ఆధునిక తెలుగు సాహిత్యం
అభ్యసన ఫలితాలు:
ఈ కోర్సు విజయవంతంగా ముగించాక, విద్యార్థులు క్రింది అభ్యసన ఫలితాలను పొందగలరు.
1. ఆంగ్లభాష ప్రభావం కారణంగా తెలుగులో వచ్చిన ఆధునిక సాహిత్యాన్ని, దాని విశిష్టతను గుర్తిస్తారు.
2. సమకాలీన ఆధునిక సాహిత్య ప్రక్రియలైన "వచన కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శలపై అవగాహన పొందుతారు.
3. భావకవిత, అభ్యుదయ కవితాలక్ష్యాలను గూర్చిన జ్ఞానాన్ని పొందుతారు. అస్తిత్వవాద ఉద్యమాలపుట్టుకను, ఆవశ్యకతను గుర్తిస్తారు.
4. కథాసాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని పొందుతారు. సిద్ధాంతాల ద్వారా కాకుండా, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ద్వారా సిద్ధాంతాన్ని సమీక్షించగలరు.
5. ఆధునిక తెలుగు కల్పనాసాహిత్యం ద్వారా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని పొందుతారు.

బి.ఏ., బి.కాం., బి.యస్సి., తదితర ప్రోగ్రాములు
à°…à°‚à°¶à°‚: జనరల్ తెలుగు, à°¸à±†à°®à°¿à°¸à±à°Ÿà°°à±-3
కోర్సు - 3 : సృజనాత్మక రచన

అభ్యసన ఫలితాలు:
ఈ కోర్సు విజయవంతంగా ముగించాక, విద్యార్థులు క్రింది అభ్యసన ఫలితాలను పొందగలరు.
1. తెలుగు సాహిత్య అభ్యసన ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను, సృజనాత్మక నైపుణ్యాలుగా మార్చుకోగలరు.
2. విద్యార్థులు భాషాతత్వాన్ని, భాష యొక్క ఆవశ్యకతను, భాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు. మనిషి వ్యక్తిగత జీవనానికి, సామాజికవ్యవస్థ పటిష్టతకు భాష ప్రధానమని తెలుసుకుంటారు. తెలుగుభాషలోని కీలకాంశాలైన 'వర్ణం - పదం - వాక్యా'ల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, వాగ్రూప- లిఖితరూప వ్యక్తీకరణ ద్వారా భాషానైపుణ్యాలను మెరుగుపరచుకోగలరు.
3.భాషానైపుణ్యాలను అలవరచుకోవడంతోపాటు వినియోగించడం నేర్చుకుంటారు. రచనా, భాషణానైపుణ్యాలను సృజనాత్మక రూపంలో వ్యక్తీకరించగలరు.
4. ప్రాచీన పద్యరచనతో పాటు ఆధునిక కవిత, కథ, వ్యాసం, మొదలైన సాహిత్య ప్రక్రియల
నిర్మాణాలకు సంబంధించిన సిద్ధాంతవిషయాలను నేర్పడంతో పాటు వారిలో రచనా నైపుణ్యాలను పెంపొందించుకోగలరు.
5. సృజన రంగం, ప్రసారమాధ్యమ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు.
6. అనువాద రంగంలో నైపుణ్యం సంపాదించగలరు.